యూత్ కాంగ్రెస్‌ నిరసనలపై అఖిలేష్ చురకలు

5
- Advertisement -

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్… యూత్ కాంగ్రెస్ నిరసనపై తీవ్రంగా స్పందించారు. AI సమ్మిట్ 2026లో అర్ధనగ్నంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ధర్నా దేశ ప్రతిష్టకు మచ్చ తేవడమేనని అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ వేదికపై ఇలాంటి నిరసనలు చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మన దేశంలో రాజకీయంగా విభేదాలు, అంతర్గత గొడవలు ఉండొచ్చని, కానీ వాటిని దేశ సరిహద్దుల లోపలే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచ వేదికపై దేశాన్ని ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని పేర్కొన్నారు.

సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా దేశ గౌరవం కాపాడడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమే అయినా, అవి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయకుండా ఉండాలని సూచించారు.

Also Read:ఆసీస్‌ గడ్డపై భారత మహిళ జట్టు అద్భుతం

- Advertisement -