టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగు నెలల క్రితం నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఇప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది అని ఆయన అన్నారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోందని పేర్కొన్నారు. పరిశీలకుడిగా నియమించిన ఓ రిటైర్డ్ వ్యక్తి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష వసూలు చేశాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన అబ్జర్వర్స్ ఎవరన్నది గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలు పవిత్ర సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంపంగి మండపంలో ఉద్యోగులు, వేదపండితులను కూడా బెదిరిస్తున్నారని, “మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి… కరుణాకర్ రెడ్డికి సమాచారం ఇస్తే అది సీఎం కార్యాలయానికి వెళ్తుంది” అంటూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఈ తరహా బెదిరింపులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
టీటీడీ పరిపాలనలో పారదర్శకత, న్యాయం ఉండాలని, అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు.
Also Read:రైతు బడి అగ్రి షోలో మాజీ మంత్రి హరీష్

