ఏపీ పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం

4
- Advertisement -

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఆలస్యం జరుగుతోందని, నిందితులతో కుమ్మక్కై దర్యాప్తు సాగదీస్తున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ … “మీకు చేతకాకుంటే చెప్పండి, కేసును సీబీఐకి అప్పగిస్తాం” అంటూ రాష్ట్ర దర్యాప్తు యంత్రాంగంపై వ్యాఖ్యానించారు. కేసు ట్రయల్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.

అదే సమయంలో ట్రయల్ పూర్తయ్యే వరకు అనంత బాబు బెయిల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలతో కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. కేసు పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

- Advertisement -