- Advertisement -
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కడియం శ్రీహరిపై ఘాటు విమర్శలు చేశారు. కడియం శ్రీహరి తన బిడ్డ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని రాజయ్య ఆరోపించారు.
తాను ఉన్న పార్టీపై విమర్శలు చేయడం సరికాదని, “తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారు” అంటూ మండిపడ్డారు. రాజకీయ లాభాల కోసం పార్టీ మారారని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని విమర్శించారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాపై నేరుగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజల తీర్పుతో ఎవరు బలమైన నాయకులో తేలుతుందని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!
- Advertisement -

