AI మోనోపొలి కాదు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో “MANAV విజన్”ను ఆవిష్కరించారు. కృత్రిమ మేధస్సు (AI) మానవ కేంద్రంగా, నైతికంగా మరియు సమగ్రంగా ఉండాలనే ఐదు సూత్రాల రూపకల్పనను ఆయన ప్రపంచానికి వివరించారు. 118 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ప్రధాని మాట్లాడుతూ, AI కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, ఇది నాగరికతకు మలుపు తిప్పే శక్తి అని అన్నారు. సరైన దిశలో నడిపితే ఇది పరిష్కారం, లేకపోతే విఘాతం అవుతుందని పేర్కొన్నారు.
MANAV విజన్ – ఐదు సూత్రాలు
M – Moral & Ethical Systems: నైతిక విలువల ఆధారంగా AI అభివృద్ధి.
A – Accountable Governance: పారదర్శక నియంత్రణ, బాధ్యతాయుత పర్యవేక్షణ.
N – National Sovereignty: డేటాపై దేశానికి యాజమాన్య హక్కు.
A – Accessible & Inclusive: AI మోనోపలీ కాకుండా అందరికీ ఉపయోగపడే సాధనం కావాలి.
V – Valid & Legitimate: చట్టబద్ధత, నమ్మకదృక్పథం.
మనుషులు కేవలం డేటా పాయింట్లు కాదు, ముడి సరుకు కాదు అని ప్రధాని స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలు AI యుగంలో భాగస్వాములు మాత్రమే కాకుండా, నిర్మాణ శిల్పులు కావాలని పిలుపునిచ్చారు. డీప్‌ఫేక్‌ల వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు గ్లోబల్ ప్రమాణాలు అవసరమని, డిజిటల్ కంటెంట్‌కు నిజస్వరూప గుర్తింపులు (ఆథెంటిసిటీ లేబుల్స్) ఉండాలని సూచించారు. AI భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, దాన్ని మానవ సంక్షేమ దిశగా మలచాల్సిన బాధ్యత మనదేనని ఆయన అన్నారు.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

