ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

3
- Advertisement -

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ మంగళవారం భారత్‌కు చేరుకున్నారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ను కలవనున్నారు. ఇటీవల భారత్ 114 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించిన నేపథ్యంలో రక్షణ సహకారం ప్రధాన అజెండాగా నిలిచింది.

ముంబైలోని లోక్ భవన్‌లో మధ్యాహ్నం సుమారు 3:15 గంటలకు మోదీ-మాక్రోన్ ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని సమీక్షించి, భవిష్యత్ సహకార మార్గాలను నిర్ణయించనున్నారు. రక్షణ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, సరఫరా గొలుసులు తదితర రంగాల్లో సుమారు 12 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదరనున్నాయి.

ముంబైలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని గేట్‌వే ఆఫ్ ఇండియాలో ప్రారంభించనున్నారు. ఇది 2026 వరకు రెండు దేశాల్లో సాంకేతికత, సృజనాత్మకత, సాంస్కృతిక మార్పిడిపై దృష్టి సారిస్తుంది.

బెంగళూరులో 6వ వార్షిక రక్షణ సంభాషణ కూడా జరగనుంది. రక్షణ సహకార ఒప్పందాన్ని మరో 10 సంవత్సరాలకు పొడిగించే అవకాశముంది. ఇండో-పసిఫిక్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. ముంబై విమానాశ్రయంలో మహారాష్ట్ర గవర్నర్ అచార్య దేవ్‌వ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాక్రోన్‌కు స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

- Advertisement -