KTR:మీరే ఎప్పటికి నా హీరో!

6
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి . ఎక్స్ వేదికగా కేసీఆర్‌కు విషెస్ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరే ఎప్పటికి నా హీరో.. ప్రతి రోజూ నన్ను ప్రేరేపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి, ఎల్లప్పుడూ ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలి అని తెలిపారు.

అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు కేసీఆర్ అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ఆయన మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని భగవంతుడిని ప్రార్థించారు.

కేసీఆర్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

 

Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

- Advertisement -