కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!

4
- Advertisement -

జగిత్యాల రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ఏంటో గోచరించట్లేదని, అవమానాలు ఇంకెంతకాలం భరించాలనే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక ముగింపు కాదని, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంతకాలం తనకు వేధింపులు తప్పవని అన్నారు.

జగిత్యాల కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి, “పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చారా?” అంటూ విమర్శించారు. స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదంటున్నారని, కానీ ఆయన సంసారం మాత్రం కాంగ్రెస్‌తోనే నడుస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాలలో పరిస్థితి ఇలా ఉంటే, పార్టీ మారిన మరో తొమ్మిది ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలన్నారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Also Read:రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు!

- Advertisement -