రాజస్థాన్‌లో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదత్ గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ శుభ్‌కరణ్ పరిహర్( Shubhkaran Parihar) నివాసంలో అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ దాడులు చేపట్టింది.
ఈ సోదాల్లో కేజీకి పైగా బంగారం, సుమారు రూ.75 లక్షల నగదు, 42 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో శుభ్‌కరణ్ పరిహార్ తన అధికారిక వేతనానికి మించి ఏకంగా 938 శాతం అధికంగా ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది.
సాధారణ జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తూ ఇంత భారీ స్థాయిలో ఆస్తులు సేకరించడం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన ACB అధికారులు ఆస్తుల మూలాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలపై మరింత దృష్టి సారించేలా చేసింది.
Also Read:శివరాత్రి…ఉపవాసం ఎందుకు!

