కేంద్రమంత్రి రామ్మోహన్‌తో రేవంత్ భేటీ

4
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మామూనూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

మామూనూరు విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని సీఎం వివరించారు. ఇకపై అవసరమైన సాంకేతిక, పరిపాలనా పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పాల్వంచలో స్థలం గుర్తించినట్లు వెల్లడించిన సీఎం, అక్కడ వెంటనే OLS (Obstacle Limitation Surface) సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.

Also Read:IND vs PAK:మ్యాచ్‌కి వరణుడు అడ్డంకి?

అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ మూడు విమానాశ్రయాలు కీలకమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -