ఆప్ లీడర్‌ ఒబెరాయ్‌ దారుణ హత్య

3
- Advertisement -

పంజాబ్‌లోని జలంధర్ మోడల్ టౌన్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గురుద్వారా బయట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత లక్కీ ఒబెరాయ్‌ను కాల్చి చంపారు. లక్కీ ప్రతిరోజూ మాదిరిగానే ఉదయం 8:15 గంటల సమయంలో గురుద్వారాకు వెళ్లాడు. గురుద్వారా బయట ఉన్న సమయంలో దుండగుడు అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన లక్కీని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు.

థార్ SUVలో ప్రయాణిస్తున్న లక్కీపై దుండగులు 7 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపారు. కొన్ని బుల్లెట్లు ఛాతీ, తల భాగాల్లో తగిలినట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే దర్యాప్తు బృందానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
లక్కీ ఒబెరాయ్ భార్య గతంలో మున్సిపల్ ఎన్నికల్లో AAP అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ ఘటనపై పంజాబ్ శాసనసభ ప్రతిపక్ష నేత పార్టాప్ సింగ్ బజ్వా తీవ్రంగా స్పందించారు. జలంధర్‌లో పగటి వేళ లక్కీ ఒబెరాయ్ హత్యకు పాల్పడటం పంజాబ్‌లో శాంతి భద్రతలు కుప్పకూలిన పరిస్థితిని చూపుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు.

Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

- Advertisement -