నాలుగు వారాల్లో తెలంగాణ డిజిపి నియామకంపై తేల్చండి అని యుపిఎస్సి కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ డిజిపి నియామకంపై సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది.
నాలుగు వారాల్లో డిజిపి నియామకంపై యూపీఎస్సీ తగిన సిఫారసులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారుల యోగ్యత ఆధారంగా సిఫారసులు చేయాలి ..సకాలంలో యూపీఎస్సీకి ప్రతిపాదిత డిజిపి పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయి . ఈ ఆలస్యం వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుంది అన్నారు.
యాక్టింగ్ డిజిపి పేరుతో రెగ్యులర్ డిజిపిని నియమించడం లేదు .. రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే… త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాలకు యూపీఎస్సీ లేఖలు రాయాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు .. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పవని సుప్రీం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read:భారత్తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

