సృష్టి ధర్మం తిరగబడింది.. ఒక బ్రిటిష్ పురుషుడు పాపకు జన్మనిచ్చాడు. మీరు చదివింది నిజమే.. అయితే నిజానికి 20 ఏళ్ల హేడెన్ క్రాస్ పురుషుడు కాదు.. స్త్రీ.. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ చికిత్స చేయించుకుంటున్నాడు. అతడు ఫేస్‌బుక్ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. గత నెల 16న గ్లూసెస్టర్‌షైర్‌లోని రాయల్ హాస్పిటల్‌లో పాపకు జన్మనిచ్చాడు. బ్రిటన్‌లో బిడ్డకు జన్మనిచ్చి తొలి మగాడిగా రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం తండ్రీ, కూతుళ్లు ఇద్దరూ బాగున్నట్లు ఆసుపత్రి ప్రకటించింది. నిజానికి పూర్తిగా పురుషుడిగా మారిన తర్వాత గర్భం దాల్చుదామని తన అండాలను ఫ్రీజ్ చేసే ప్రక్రియ కోసం క్రాస్ ప్రయత్నించాడు. అయితే దీనికి కోర్టు అడ్డుపడింది. ఈలోపు వీర్యదాత దొరకడంతో గర్భం దాల్చి తండ్రయ్యాడు.
అయితే భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా అందుకు 4 వేల పౌండ్లు ఖర్చవుతుందని, దాన్ని భరించలేమంటూ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించిండంతో .. అతడు ఫేస్‌బుక్ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నానని, తాను బిడ్డను కనాలన్న కోరికను తీర్చుకున్నానని.. మంచి నాన్నను అవుతానని హేడెన్ చెప్పాడు.