అదేం విడ్డూరమో.. బొడ్డుపై కొబ్బరి చిప్పతో కొట్టడం !

204
Tapsee's comments turns into a controversy
Tapsee's comments turns into a controversy
- Advertisement -

సినిమాల్లో అవకాశం వచ్చినపుడు ఎగిరి గంతేసిన తాప్సి ఇప్పుడు తెగ ఫీలైపోతోంది. కాస్త కదిపితే చాలు మనసులో మాటని మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. ఇంతకీ తాప్సికి ఏమైంది..? అప్పుడెందుకు గంతులేసింది, ఇప్పుడెందుకు తెగ ఫీలైపోతోంది..అనుకుంటున్నారా?.. ఎన్ని సినిమాలు చేసినా తనకి సరైన గుర్తింపు రావడంలేదని వాపోతోంది తాప్సి.

 manoj_tapsi_in_jhummandi_nadam

సౌత్‌ సినిమాల్లో హీరోయిన్లకు గుర్తింపు వుండదనీ, ఎక్స్‌పోజింగ్‌ తప్ప నటనకు ఛాన్స్‌ వుండదనీ అంటోంది. ఇక అవార్డులు రాకపోవడం తనకు కొత్త కాదు కాబట్టి తానేం ఫీలవ్వడం లేదని, అయినా..సౌత్‌లో గ్రూపులు కడితేనే అవార్డులు దక్కుతాయని, ఇదే వాస్తవమని చెప్పుకొచ్చిన తాప్సీ… తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై సంచలన విమర్శలు చేసింది.

Tapsee

తాప్సీని కె.రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ హీరోగా 2010లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ.. రాఘవేంద్ర రావు తన సినిమాల్లో సహజంగానే హీరోయిన్ల బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశాలను పెడుతుంటారు. ఝుమ్మందినాదం సినిమాలోనూ తాప్సీ బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశంపై ఆమె విమర్శలు చేశారు.

jummandhi nadham

‘‘నా తొలి సినిమాను డైరెక్ట్ చేసినా ఆ సీనియర్ డైరెక్టర్ అప్పటికే వందకు పైగా చిత్రాలు తీశారు. శ్రీదేవి, జయప్రద వంటి వారిని స్టార్లుగా తీర్చిదిద్దారు. అదేం విడ్డూరమో తెలియదు కానీ.. ఆయన తన సినిమాల్లో హీరోయిన్ల బొడ్డును పండ్లు, పువ్వులతో కొట్టిస్తుంటారు. నేను కూడా ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే ఏ శ్రీదేవినో అయిపోతానని అనుకున్నా. కానీ, నా తొలి రోజు షూటింగే పాటతో ప్రారంభమైంది. ఆ పాటలో నా బొడ్డును కొబ్బరి చిప్పతో కొట్టించేశారు. ఆయన అలా ఎందుకు కొట్టించారో నాకైతే ఇప్పటిదాకా తెలియదు. అదేం విడ్డూరమో’’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. తెలుగు సినిమాలవల్లే హిందీలో ఆఫర్లు వస్తున్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలంటూ తెలుగు ఆడియెన్స్ ఆమెను ఏకిపారేస్తున్నారు.

ఈ వీడియోను చూపిస్తుండగా ఆడియెన్స్‌తోపాటు చర్చావేదికలో పాల్గొన్నవారంతా పడిపడి నవ్వారు. తెలిసో తెలియకో తాప్సీ మాత్రం రాఘవేంద్రరావు పరువును జాతీయ స్థాయిలో గంగలో కలిపింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.

https://twitter.com/TeluguMemes/status/883589082948882432

- Advertisement -