అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, ఇతర హీరోయిన్ల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవల అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్ విహారయాత్రకు వెళ్లారు. అదే సమయంలో నటి దివ్యభారతి తన పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ అనుకోకుండా ఆమె అల్లు అర్జున్‌ను కలుసుకుని కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోను దివ్యభారతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, ఆమె AA22 సినిమాలో దివ్య భారతి నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫిషియల్ అనౌనస్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్
ప్రస్తుతం దివ్యభారతి నటించిన GOAT సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా, ఆమెకు సంబంధించిన పలు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

