మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బారామతి సమీపంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందారు. పవార్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.చార్టర్ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడంపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ…ఇది చాలా షాకింగ్, బాధాకరమైన వార్త. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.
డీఎంకే ఎంపీ టి. శివ మాట్లాడుతూ…ఇది చాలా విషాదకరం. నా దుఃఖాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎంతో చురుకైన రాజకీయ నాయకుడు అన్నారు.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ..ఇంత శక్తివంతమైన నాయకుడు అకస్మాత్తుగా మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు.
Also Read:విమాన ప్రమాదం..అజిత్ పవార్ మృతి

