మాస్ మహారాజా రవితేజ, యూనిక్ స్టొరీ టెల్లింగ్, అద్భతమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. #RT77 రవితేజ, శివ నిర్వాణ మధ్య ఫస్ట్ కొలాబరేషన్. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో హ్యుజ్ కాన్వాస్‌పై నిర్మిస్తోంది.
శివ నిర్వాణ పవర్ ఫుల్, యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. రవితేజ ఇంతవరకు ఎప్పుడూ చేయని డిఫరెంట్ జానర్ మూవీ ఇది. కథలోని బలమైన ఎమోషన్, తన క్యారెక్టర్ ఆర్క్ కి ఇంప్రెస్ అయిన రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకోసం ఆయన పూర్తిగా స్ట్రైకింగ్ మేకోవర్‌లో కనిపించబోతున్నారు.
ఇవాళ రవితేజ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ఖరారు చేశారు. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న #RT77కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో
Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

