IAS-IPS..అధికారుల ఆదర్శ వివాహం

10
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఆదర్శంగా నిలిచింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆర్భాటం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

చౌటుప్పల్ సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో చట్టబద్ధంగా జరిగిన ఈ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ఖర్చులు, ఆడంబరాలు లేకుండా సరళమైన విధానంలో వివాహం జరిపి యువతకు మంచి సందేశాన్ని అందించారు.

ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు.

ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అధికార హోదాలో ఉన్నప్పటికీ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ చేసిన ఈ వివాహం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

Also Read:Modi:‘వికసిత్ భారత్’ నిర్మాణం

- Advertisement -