భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు బంగ్లాదేశ్ వెళ్లేందుకు నిరాకరించడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంటే ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేస్తామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
టీ20 వరల్డ్‌కప్ వేదికల విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరియు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మధ్య కొనసాగుతున్న వివాదమే ఈ పరిస్థితికి కారణం. భారత్‌లో భద్రత లేదని పేర్కొంటూ, తమ గ్రూప్ మ్యాచ్‌లను సహ ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే ఐసీసీ ఈ అభ్యర్థనను తిరస్కరించింది.
దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ఎంపికకు మొగ్గుచూపింది ఐసీసీ. ఎందుకంటే ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత పొందని జట్లలో స్కాట్లాండ్ అత్యున్నత ర్యాంక్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్, జెర్సీ జట్ల వెనుక నిలిచి స్కాట్లాండ్ నేరుగా అర్హత సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో వారి స్థానం ఇతర నాన్-క్వాలిఫైడ్ జట్ల కంటే మెరుగ్గా ఉండటంతో, చివరి నిమిషంలో మార్పు అవసరమైతే స్కాట్లాండ్ సరైన ఎంపికగా మారింది.
Also Read:న్యాయస్థానంతో ఆటలా:హైకోర్టు
ఇది ఐసీసీ చరిత్రలో అరుదుగా జరిగే, మధ్యలో జట్టు మార్పు చేసిన ప్రధాన టోర్నీగా నిలవనుంది.

