ప్రయాగ్‌రాజ్‌లో విమాన ప్రమాదం

1
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం ఒక చిన్న విమానం ప్రమాదానికి గురైంది. విమాన ప్రయాణంలో ఉండగానే నియంత్రణ కోల్పోయిన చిన్న విమానం కేపీ కాలేజ్ వెనుక ఉన్న ఓ చెరువులో కూలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం ఏర్పడింది. పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం, గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి నగరంలోని కేపీ కాలేజ్ వెనుక భాగంలో ఉన్న నీటి మడుగులో పడిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!

- Advertisement -