జాతీయ రాజధాని ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ అధికారిక నివాసం (21, మదర్ థెరిసా క్రెసెంట్ రోడ్)లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఉదయం 8:05 గంటలకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారులు తెలిపారు.
మొదట హౌస్ నంబర్ 2లో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం వచ్చినప్పటికీ, తర్వాత అది హౌస్ నంబర్ 21లోని రవి శంకర్ ప్రసాద్ నివాసంలోనే జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఇంట్లోని ఒక గదిలో ఉన్న మంచంపై మంటలు చెలరేగినట్లు వెల్లడించారు.
ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఘటన సమయంలో పాట్నా సాహిబ్ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం తక్షణమే తెలియరాలేదు.పరిస్థితిని అంచనా వేసేందుకు ఫైర్ సర్వీసెస్ సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసుల ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడికి చేరుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:శ్రేయాస్‌ను ఇమిటేట్ చేసిన విరాట్!

