ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ చీఫ్!

5
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఏదైనా తప్పు చర్యకు పాల్పడితే, భూసైనిక దాడులు ప్రారంభించేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మంగళవారం వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్‌పై సంప్రదాయ (కన్వెన్షనల్) సైనిక చర్యలకు భారత్ పరిధిని గణనీయంగా విస్తరించిందని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనరల్ ద్వివేది మాట్లాడుతూ..ఆ 88 గంటల వ్యవధిలో మీరు చూశారు. సంప్రదాయ యుద్ధ పరిధిని విస్తరించేలా సైన్యం చేసిన మొబిలైజేషన్‌ వల్ల, పాకిస్థాన్ ఏ చిన్న పొరపాటు చేసినా భూసైనిక ఆపరేషన్లు ప్రారంభించేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.
ఇంతకు ముందు అంచనాల ప్రకారం, సంప్రదాయ సైనిక చర్యల పరిధి క్రమంగా తగ్గిపోతూ, సంఘర్షణలు త్వరగా ఉప-సంప్రదాయ స్థాయి నుంచి అణు స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని భావించేవారని ఆయన చెప్పారు. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ తీసుకున్న చర్యలు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని చూపించాయని వివరించారు.

ఈసారి మేము తీసుకున్న చర్యలు — ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన కాల్పులు, వాటికి మేము ఇచ్చిన సమాధానం — సంప్రదాయ యుద్ధ పరిధిని మేము విస్తరించామనే విషయాన్ని స్పష్టంగా చూపించాయి అని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో సుమారు 100 మంది పాకిస్థాన్ సిబ్బందిని భారత దళాలు మట్టుబెట్టాయని ఆయన వెల్లడించారు.

అదే సమయంలో, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చల్లో ఎలాంటి అణు బెదిరింపుల మాటలు రాలేదని, అలాంటి వ్యాఖ్యలు కేవలం పాకిస్థాన్ రాజకీయ నాయకుల నుంచే వచ్చాయని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు.

Also Read:Delhi AQI:మూడేళ్లలో ఇదే తొలిసారి!

- Advertisement -