గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా చర్య తప్పదు!

5
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా గ్రీన్‌ల్యాండ్‌పై మేము ఏదో ఒకటి చేస్తాం అంటూ స్పష్టం చేశారు. చైనా లేదా రష్యా అక్కడ ప్రభావం సంపాదించకుండా ఉండాలంటే అమెరికా తప్పకుండా చర్య తీసుకోవాల్సిందేనని ఆయన వాదించారు.

వైట్ హౌస్‌లో ప్రముఖ ఆయిల్, గ్యాస్ సంస్థల అధినేతలతో సమావేశం అనంతరం జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము చర్యలు తీసుకోకపోతే రష్యా లేదా చైనా గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. రష్యా లేదా చైనాను మా పొరుగువారిగా మేము చూడాలనుకోవడం లేదు. సులభమైన మార్గంలో ఒప్పందం కావాలనుకుంటున్నాను. కానీ అది కుదరకపోతే కఠిన మార్గంలో ముందుకెళ్తాం అని ట్రంప్ అన్నారు.

డెన్మార్క్‌పై స్పందిస్తూ 500 ఏళ్ల క్రితం అక్కడ ఒక పడవ దిగిందని భూమి వాళ్లదైపోదు. మేమూ చాలా పడవలు అక్కడికి పంపాం అని వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్ చుట్టూ రష్యన్, చైనా నౌకలు, సబ్‌మేరీన్లు ఉన్నాయని, అవి ఆక్రమణకు దారి తీయవచ్చని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ను ‘సొంతం చేసుకోవడం’ ఎందుకు అవసరమని ప్రశ్నించగా.. లీజ్‌లను కాదు, యాజమాన్యాన్ని మాత్రమే రక్షిస్తారు. దేశాలకు యాజమాన్యం ఉండాలి అని అన్నారు. నాటోపై కూడా వ్యాఖ్యానిస్తూ నేను లేకపోతే నాటో ఉండేది కాదు అని చెప్పారు.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ పెద్ద సమస్యల్లో ఉంది. ప్రజలు ఊహించని నగరాల్లో నియంత్రణ చేపడుతున్నారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. ప్రభుత్వం మళ్లీ ప్రజలను చంపితే, మేము జోక్యం చేసుకుంటాం. వారికి గట్టిగా దెబ్బ కొడతాం అని ట్రంప్ అన్నారు.

- Advertisement -