విద్యాశాఖ పెండింగ్ బకాయిలపై గుత్తా

9
- Advertisement -

తెలంగాణ విద్యా శాఖ పనితీరుపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను శాసనమండలిలో ఆయన బహిర్గతం చేస్తూ, ఇది పూర్తిగా “పనితీరు భాగోతం”గా మారిందని వ్యాఖ్యానించారు.

మన ఊరు–మన బడి పథకానికి సంబంధించిన రూ.360 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. “మా విలేజ్ స్కూల్ పరిస్థితి గురించి నేను ఏడాది కాలంగా చెబుతున్నా. ఇప్పటికీ పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి కూడా తెలియజేశాను” అని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని తీసుకువచ్చి, దానిని మైనింగ్ సెస్‌కు అనుసంధానం చేశారని విమర్శించారు. మైనింగ్ సెస్ వచ్చే చోట్ల మాత్రమే నిధులు విడుదల అవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో అవి కూడా ఆగిపోయిన పరిస్థితి ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే డ్రాపౌట్స్ భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మూడు లక్షల మంది విద్యార్థులను చేర్చుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి 30 వేల మందిని కూడా చేర్చుకోలేదని ఆరోపించారు. “లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చుకుని పనులు పూర్తి చేశారని, వారి కష్టాన్ని గుర్తించి మన ఊరు–మన బడి పేమెంట్స్‌ను వెంటనే చెల్లించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్‌

- Advertisement -