ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్‌పై ఫిర్యాదు

5
- Advertisement -

ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్‌పై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయాలు, హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీయడమే కాకుండా, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అన్వేష్ వ్యవహారంపై ఇప్పటికే స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుగు సంఘాలు వెల్లడించాయి. అతడి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా కాకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెంది ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని వారు పోలీసులకు వివరించారు. శాంతియుత సహజీవనాన్ని భంగం చేసే చర్యలను ఆస్ట్రేలియా వంటి ప్రజాస్వామ్య దేశం సహించకూడదని వారు కోరారు.

అలాగే అన్వేష్ ఆస్ట్రేలియాకు రాకుండా అతడి వీసాను రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా భారతీయులు కోరారు. మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి దేశంలోనూ అవకాశం ఇవ్వకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారతీయ సమాజ గౌరవం, మతపరమైన సహనం కాపాడాలంటే ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Also Read:టైసన్ నాయుడు…యాక్షన్ ప్యాక్డ్!

- Advertisement -