సామ్‌.. చైతూ మూడు రోజుల పెళ్లి…!

319
Chaitu -Samantha Wedding on Goa
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, సమంతల పెళ్లి తేదీ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 6న గోవాలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.  హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. కాగా, ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నటించినప్పటి నుంచీ చైతూ, సమంత మధ్య ప్రేమ చిగురించింది. కాగా, నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం జనవరిలో వైభవంగా జరిగింది. అప్పటి నుంచి వారి పెళ్లి తేదీలకు సంబంధించి పలు ఊహాగానాలు తెరపైకి రావడం తెలిసిందే.

Chaitu -Samantha Wedding on Goa
అయితే వీరి పెళ్లి  అక్టోబర్‌ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. ఈ వివాహానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

వివాహం అనంతరం చైతన్య, సమంత 40 రోజుల పాటు హనీమూన్‌కి న్యూయార్క్‌కి వెళ్లనున్నట్లు మీడియా వర్గాల సమాచారం. పెళ్లి తేదీలోపు చైతన్య, సమంత తమ సినిమా ప్రాజెక్ట్‌లన్నీ పూర్తిచేయనున్నారు. ఇప్పటికే తన పెళ్లి కోసం ప్రత్యేకమైన చీరలు తయారు చేయించుకుంటుందని తెలుస్తుండగా, చైతూ అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట.

- Advertisement -