దానికి నో చెప్పేస్తోన్న కేథరిన్..!

204
Catherine say no for item songs
- Advertisement -

2013లో రిలీజైన అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్ లేచిపోద్ది అంటూ చిందేసింది కేథరిన్. అందాల ఆరబోతకు అందరికంటే ముందే సై అంటూ సిగ్నల్ ఇచ్చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్‌లో అందాలను ఆరబోసినా  ఈ బ్యూటీ సరైనోడులో ఎమ్మెల్యేగా తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో మంచి  ఆఫర్లతో దూసుకెళ్తోంది.

Catherine say no for item songs
మత్తు కళ్లతో యూత్‌ని మైమరిపించే కేథరిన్ ఆ మధ్య ఐటెం సాంగ్స్‌లో కూడా అదరగొట్టింది. దీంతో ఈ బ్యూటీని ఐటెం సాంగ్స్ కోసం సంప్రదించేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారట. అయితే, ఈ బ్యూటీ మాత్రం ఐటెం సాంగ్స్ చేసేది లేదని తెగేసి చెబుతోందట.

మరి ‘ జయ జానకి నాయక’లో ఎందుకు స్పెషల్ సాంగ్ చేసినట్టు? అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో స్పందించింది. ‘సరైనోడు’లో తనకి బోయపాటి మంచి పాత్రను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చేశానని చెప్పింది. అయితే ఒక సినిమాకి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఆ ఒక్క పాటకి ఇవ్వడం వల్లనే ఆమె చేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినబడుతోంది.

Catherine say no for item songs
ప్రస్తుతం తెలుగులో ‘నేనేరాజు నేనే మంత్రి, ‘గౌతం నందా’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో విష్ణుతో ‘కధానాయగన్‌’ చిత్రంలోనూ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -