అల్లు కుటుంబంలో మరో శుభవార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటుడు అల్లు శిరీష్ తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 6వ తేదీన శిరీష్ – నయనిక వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో అల్లు కుటుంబ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
తన పెళ్లి తేదీని శిరీష్ ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో ప్రకటించగా, అది ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియోలో సరళమైన కానీ హృద్యమైన శైలిలో వివాహ తేదీని వెల్లడించారు. శిరీష్, నయనిక ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆ వీడియో ప్రతిబింబించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్త వెలువడిన వెంటనే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు శిరీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

