అయోధ్యకు ఏపీ సీఎం చంద్రబాబు

8
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లనున్నారు. శ్రీరామ జన్మభూమి దర్శనానికి సంబంధించి ఆయన పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 28న ఉదయం 9.10 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు అయోధ్యకు బయల్దేరనున్నారు. ప్రత్యేక విమానంలో ప్రయాణించే ఆయన ఉదయం 11.20 గంటలకు అయోధ్యలోని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. అక్కడ భద్రతా తనిఖీలు పూర్తైన అనంతరం శ్రీరామ మందిరంలో దర్శన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రామ మందిరంలో శ్రీరాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొనే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణం పూర్తైన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబు దర్శనానికి రావడం కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

దర్శన కార్యక్రమాలు పూర్తయ్యాక సీఎం చంద్రబాబు అయోధ్య నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి ప్రయాణం అవుతారు. విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి నుంచి ఆయన తన నివాసమైన ఉండవల్లికి వెళ్లనున్నారు. ఈ పర్యటన పూర్తిగా ఒకరోజులోనే ముగియనుంది. సీఎం అయోధ్య పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Also Read:KTR:పీవీ వర్ధంతి…కేటీఆర్ నివాళి

- Advertisement -