కోవిడ్ వ్యాక్సిన్లు..ఆకస్మిక మరణాలు షాకింగ్ సర్వే?

13
- Advertisement -

యువకుల్లో ఆకస్మిక మరణాలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎయిమ్స్ ఢిల్లీ నిర్వహించిన అధ్యయనం స్పష్టంచేసింది. ఈ అధ్యయనం ప్రకారం, గుండె సంబంధిత వ్యాధులే యువకుల్లో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి.

ఢిల్లీ ఎయిమ్స్‌లో నిర్వహించిన ఒక సంవత్సర కాలం పాటు సాగిన సమగ్ర పోస్టుమార్టం ఆధారిత పరిశీలనా అధ్యయనం, కోవిడ్-19 టీకాల భద్రతను మరోసారి నిర్ధారించింది. యువకుల్లో అనూహ్య మరణాలకు టీకాలకు మధ్య ఎలాంటి ఆధారాలు లేవని ఈ పరిశోధన వెల్లడించింది.

యువకుల్లో ఆకస్మిక మరణాలు ప్రజారోగ్య పరంగా తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అధ్యయనం పేర్కొంది. ఈ మరణాలకు ప్రధాన కారణంగా కరోనా ఆర్టరీ డిసీజ్ (గుండె ధమనుల వ్యాధి) కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే శ్వాసకోశ సంబంధిత మరణాలు, కారణం తెలియని మరణాలు అధికంగా ఉన్నాయని, వీటిపై మరింత లోతైన పరిశోధన అవసరమని సూచించింది. అనంతరం గుండె సంబంధిత కారణాలు అధికంగా ఉన్నాయని తెలిపింది.

Burden of Sudden Death in Young Adults: A One-Year Observational Study at a Tertiary Care Centre in India” అనే శీర్షికతో ఈ అధ్యయనాన్ని ఎయిమ్స్ ఢిల్లీ, ఢిల్లీ మరియు చండీగఢ్‌లోని ఇతర వైద్య కళాశాలల నిపుణుల బృందం నిర్వహించింది. ఈ పరిశోధన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)కు చెందిన ప్రముఖ జర్నల్ ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR)లో ప్రచురితమైంది.

ఆకస్మిక మరణాల కేసులను వర్బల్ ఆటోప్సీ, పోస్టుమార్టం ఇమేజింగ్, సంప్రదాయ పోస్టుమార్టం, హిస్టోపాథలాజికల్ పరీక్షల ద్వారా బహుశాఖ నిపుణుల బృందం విశ్లేషించింది. 18–45 ఏళ్ల వయసు గల యువకుల ఆకస్మిక మరణాల కేసులను ఏడాది పాటు పరిశీలించారు. యువతలో ఆకస్మిక మరణాలు మరియు కోవిడ్-19 వ్యాక్సినేషన్ మధ్య గణాంకపరంగా ఎలాంటి సంబంధం లేదని ఈ అధ్యయనం తేల్చింది.

వయస్సు, టీకా స్థితి, వ్యాధి చరిత్ర అంశాల్లో యువకులు, పెద్దల మధ్య పెద్ద తేడా లేదని, టీకాలు మరియు ఆకస్మిక మరణాలకు కారణ-ఫలిత సంబంధం లేదని స్పష్టం చేసింది. యువకుల్లో దాదాపు 60 శాతం మరణాలకు గుండె సంబంధిత కారణాలే ప్రధానంగా ఉన్నాయని, 20 శాతం శ్వాసకోశ వ్యాధుల కారణంగా, మిగిలినవి ఇతర గుండెేతర కారణాల వల్ల జరిగినట్లు అధ్యయనం తెలిపింది. ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా, కోవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని మరోసారి నిర్ధారిస్తున్నాయి.

Also Read:BB9:భరణి ఎలిమినేట్

యువకుల్లో ఆకస్మిక మరణాలు దురదృష్టకరమైనవైనా, అవి ఎక్కువగా ముందే గుర్తించని అంతర్గత వ్యాధుల వల్ల, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల వల్ల జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అందుకే ముందస్తు ఆరోగ్య పరీక్షలు, జీవనశైలిలో మార్పులు, సమయానుకూల వైద్య సేవలు ఎంతో అవసరమని వారు సూచించారు.

- Advertisement -