పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన తొలి సింగిల్‌కు అద్భుత స్పందన వచ్చింది. రెండో పాటను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
నార్త్ అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్ షోల బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు ఇంకా దాదాపు ఒక నెల సమయం ఉండగానే, ప్రీమియర్ ప్రీ-సేల్స్ ద్వారా $100K (లక్ష డాలర్లు) మార్క్‌ను దాటడం విశేషం. రాబోయే రోజుల్లో ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, వసూళ్ల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్‌టైనర్‌కు సంగీతం తమన్ అందిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
Also Read:గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

