మెస్సీ…ఇండియా టూర్ షెడ్యూల్

6
- Advertisement -

అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తన GOAT ఇండియా టూర్ కోసం భారత్ రావడానికి సిద్ధమవుతుండగా, ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది ఈ ఏడాది అత్యంత పెద్ద ఈవెంట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా పరిగణించే మెస్సీ, డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు నాలుగు నగరాల టూర్‌కు భారతదేశాన్ని సందర్శించబోతున్నారు. 2011 తర్వాత మెస్సీ భారతదేశంలో పర్యటిస్తుండటం విశేషం.

ఈ టూర్‌లో భాగంగా మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలను సందర్శిస్తారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కూడా మెస్సీ కలవనున్నారు. మెస్సీతో పాటు ఆయన స్నేహితులు లూయిస్ సువారెజ్ మరియు రోడ్రిగో డి పాల్ కూడా భారత్ రానున్నారు.

మెస్సీ ఉదయం 1:30 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు.తర్వాత 9:30 నుంచి 10:30 వరకు అభిమానులను కలుస్తారు.తరువాత మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరే ముందు, సౌరవ్ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతో భేటీ అవుతారు.

మెస్సీ.. పూర్తి షెడ్యూల్

డిసెంబర్ 13 – కోల్‌కతా

1:30 am: కోల్‌కతా చేరిక

9:30 am – 10:30 am: మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

10:30 am – 11:15 am: మెస్సీ విగ్రహ ఆవిష్కరణ (వర్చువల్)

11:15 am – 11:25 am: యువ భారతీ స్టేడియం చేరిక

11:30 am: షారుఖ్ ఖాన్ చేరిక

12:00 pm: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ చేరిక

12:00 pm – 12:30 pm: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, ఇంటరాక్షన్

2:00 pm: హైదరాబాద్ బయలుదేరు

7:00 pm: రాజీవ్ గాంధీ స్టేడియంలో 7v7 మ్యాచ్ — మెస్సీ vs తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సంగీత కార్యక్రమం కూడా నిర్వహణ

📍 డిసెంబర్ 14 – ముంబై

3:30 pm: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడం

4:00 pm: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్

5:00 pm: వాంఖడే స్టేడియం ఈవెంట్ + చారిటీ ఫ్యాషన్ షో

📍 డిసెంబర్ 15 – న్యూఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ

1:30 pm: అരു‌ణ్ జైట్లీ స్టేడియం ఈవెంట్

మినర్వా అకాడమీ ఆటగాళ్ల సన్మానం

Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -