- Advertisement -
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్‌డమ్’. రెండు పార్టులుగా ఈ సినిమాను అనౌన్స్‌చేయగా తొలి పార్టు విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఇప్పుడు కింగ్‌డమ్ సీక్వెల్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
అయితే సీక్వెల్ ఉంటుందని ఆశించిన విజయ్ ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా బ్యాడ్‌న్యూసే. ఎందుకంటే చిత్ర బృందం ఇక రెండో భాగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో లేరని, ప్రాజెక్ట్ కమర్షియల్‌గా లాభదాయకం కానందున సీక్వెల్‌ను నిలిపివేశారని టాక్ వినిపిస్తోంది.
ఇక అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో మరియు సినిమా వర్గాల్లో పెద్ద చర్చగా మారగా మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇస్తారో వేచిచూడాలి.
Also Read:INDvsSA:మూడో వన్డే ప్లేయింగ్ XI!
- Advertisement -

