- Advertisement -
‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఓటీటీలో అధికారికంగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో ఈ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, డిజిటల్ రిలీజ్‌తో ఆన్‌లైన్ ప్రేక్షకుల్లో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి.
ప్రత్యేకంగా రష్మిక మందన్న నటన గురించి నెటిజన్లు విస్తృతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ఆమె భావోద్వేగ నటన, ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్‌లో కనిపించిన ఆమె పర్ఫార్మెన్స్ ఇటీవల కాలంలో ఆమె చేసిన బెస్ట్ యాక్టింగ్ సీన్లలో ఒకటిగా చాలా మంది పేర్కొంటున్నారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓటీటీ విడుదలతో మరొకసారి ప్రేక్షకాదరణ పెరిగే అవకాశముందని అనిపిస్తోంది. వెండితెరపై మిక్స్‌డ్ టాక్ పొందిన ఈ చిత్రం ఓటీటీలో ఏం మాయ చేస్తుందో వేచిచూడాలి.
Also Read:INDvsSA:మూడో వన్డే ప్లేయింగ్ XI!
- Advertisement -

