అఫిషియల్‌..రాజ్‌తో సమంత పెళ్లి

8
- Advertisement -

తన రెండో పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు. ఈ ఉదయం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో భారీ సంచలనం రేగింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుక పూర్తిగా వ్యక్తిగతంగా, సాదాసీదాగా నిర్వహించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్లు పలుసార్లు వార్తలు వెలువడ్డాయి. వీరిద్దరూ పబ్లిక్‌లో కొన్ని సార్లు కలిసి కనిపించడం, వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడపడం వంటి విషయాలు గాసిప్‌లకు బలం చేకూర్చాయి. అయితే, ఇప్పటి వరకు వీరిద్దరూ ఏ విషయాన్నీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో సమంత పెళ్లి ఫోటోలు వెలుగుచూడడంతో, ఆ వార్తలకు ముగింపు పడినట్లైంది.

వివాహ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. సాధారణత, ప్రశాంతతతో సాగిన ఈ వేడుకలో సమంత సంప్రదాయ దుస్తుల్లో అత్యంత అందంగా కనిపించగా, రాజ్ కూడా సాంప్రదాయ వేషధారణలో మెరిశారు. పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, అభిమానులు, సినీ సెలబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read:సర్పంచ్ పదవికి వేలం..ఎంతో తెలుసా?

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -