హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరు ను కోయంబత్తూరు లో చేసుకుంది సమంత. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
నటి సమంత రూత్ ప్రభు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహం ఇషా యోగా సెంటర్‌లోని లింగ్ భైరవి దేవాలయంలో ప్రాతఃకాళంలో సోమవారం ఉదయం జరిగినట్లు సమాచారం. ఈ వివాహా కార్యక్రమానికి 30 మందికి దగ్గరి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది.
రాజ్ మాజీ భార్య శ్యామాలి డే కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో “Desperate people do desperate things” అనే cryptic కోట్ షేర్ చేశారు. రాజ్ మరియు శ్యామాలి 2022లో విడాకులు తీసుకున్నారు.
రాజ్ మరియు సమంత రిలేషన్ షిప్ గురించి 2024లో ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి తగ్గట్టుగానే వారిద్దరూ అనేక ఈవెంట్స్‌లో కలిసి పాల్గొన్నారు. రాజ్ మరియు సమంత USలో కూడా కలసి పర్యటన చేశారు.

సమంత ‘ది ఫ్యామిలీ మాన్’ సీజన్ 2లో ప్రతినాయక పాత్రలో నటించారు.ఇది రాజ్ మరియు DK దర్శకత్వంలో రూపొందిన ప్రాజెక్ట్. ముందుగా సమంత.. నాగ చైతన్యతో వివాహం చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు. చైతన్య తర్వాత నటి సొభితా ధులిపాలతో వివాహం చేసుకున్నారు. సమంత మరియు నాగ విడాకులు దక్షిణ భారత సినిమా పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
“ChaySam” అనే పేరు ఇచ్చి అభిమానుల మనసులో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన జంట, నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోయారు.
Also Read:AP:డయేరియా ఘటనపై వైద్యశాఖ

