ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక పెళ్లి అనూహ్య కారణంతో రద్ద యింది. లక్నోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడితో కాన్పూర్‌కు చెందిన యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తుండగా, పెళ్లి రోజు వచ్చిన ఒక చిన్న వివాదం పెద్ద గొడవగా మారి చివరకు పెళ్లే రద్దైపోయింది.
పెళ్లి ఊరేగింపు నిర్ణయించిన సమయానికి ఆలస్యంగా రావడంతో వధువు కోపం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, వరుడి బంధువుల్లో కొందరు మత్తులో ఉన్నట్లు ఆమె ఆరోపించింది. ఈ విషయాలపై ఇప్పటికే ఉద్రిక్తత నెలకొన్న సమయంలో, వరుడు పదేపదే వేడి నీళ్లు అడుగుతున్నాడని, అతడి ప్రవర్తన విచిత్రంగా ఉందని వధువు విమర్శించింది. కోపావేశంలో వరుడిని “పిచ్చోడు” అని పిలవడంతో పరిస్థితి మరింత దిగజారింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తమ కొడుకుని ఇలా అవమానించినందుకు వరుడి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ పెరిగిపోవడంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణలోకి దిగడంతో కొంతసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. అయితే, ఇరుకుటుంబాలు చివరకు ఈ వివాహాన్ని రద్దు చేసుకోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాయి.
వివాహ వేదికపై ప్రారంభమైన ఈ కలహం చివరికి పెళ్లిని నిలిపివేయడంతో, రెండు కుటుంబాలు నిరాశతో తిరుగు ప్రయాణమయ్యాయి.
Also Read:TTD:డిసెంబర్.. విశేష పర్వదినాలు

