Karnataka:తెగని సీఎం సీటు పంచాయతీ!

5
- Advertisement -

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి అంశంపై రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య సాగుతున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకున్నాయి. ఈ సమస్య నేపథ్యంలో పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి సమావేశాలు నిర్వహించడం, తమ-తమ వర్గాలకు మద్దతును సమీకరించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దళిత నేతలు తమకు అనుకూలంగా నిర్ణయం రావాలని ఆశిస్తూ, ఒక దళిత మంత్రికి చెందిన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు, సిద్ధరామయ్య అనుచరులు తమ నేతనే మిగతా కాలంపాటు సీఎం గా కొనసాగించాలని స్పష్టంగా చెబుతున్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వాదిస్తున్నారు. కాగా, డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం ఎన్నికల ముందు పార్టీ ఇచ్చిన హామీ ప్రకారమే మిగిలిన రెండున్నర సంవత్సరాలు తమ నేతకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

ఈ అంతర్గత బలగాల మధ్య కొనసాగుతున్న పోరు కారణంగా, కర్ణాటకలో సీఎం కుర్చీపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సోనియా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేతలు ఆమెతో భేటీ కానున్నారు. ఆ భేటీ అనంతరం హైకమాండ్ ఈ కీలక విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కర్ణాటకలో సీఎం పదవి విషయంలో హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది.

Also Read:BB9:కెప్టెన్సీ రేసులో ఆరుగురు

- Advertisement -