నటుడు ధర్మేంద్ర ఇకలేరు..

12
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

ధర్మేంద్ర మృతితో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

‘అలీబాబా ఔర్ 40 చోర్’, ‘దోస్త్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సన్నీ’, ‘గాయల్’, ‘లోఫర్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన దేశవ్యాప్తంగా మంచి పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సినీ కెరీర్ ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగింది.

‘షోలే’ (Sholay) వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో ధర్మేంద్ర పోషించిన వీరూ పాత్ర భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. ఆయన కేవలం రొమాంటిక్ హీరోగానే కాకుండా, యాక్షన్ మరియు కామెడీ పాత్రలలోనూ ప్రేక్షకులను అలరించారు.

Also Read:అనిల్ రావిపూడికి చిరు గిఫ్ట్!

- Advertisement -