పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

6
- Advertisement -

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బై పోల్‌లో పోస్టల్ బ్యాలెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది. పోస్టల్ బ్యాలెట్‌తో పాటు EVMల కౌంటింగ్ ప్రారంభం అయింది.

హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్లు వేశారు వృద్ధులు, వికలాంగులు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ కు 39, బీఆర్ఎస్‌ కు 36 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి.

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నంలోపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడే అవకాశం ఉంది.

Also Read:SSMB29:మహేష్ మూవీలో మాధవన్!

- Advertisement -