త్వరలో టీటీడీ AI చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకురానుంది. 13 భాషలలో సేవలందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు అమెజాన్ సంస్థ టెండర్‌కు ఆమోదం తెలిపింది.
ఆన్లైన్లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదుల వివరాలు, ఇతర ముఖ్యమైన వివరాలు వేగంగా తీసుకునే విధంగా చాట్‌బాట్ సహయపడనుంది. ఏడాదికి రూ.50 లక్షలకే సేవలు అందించనుంది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇందుకు సంబంధించి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా, వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!
ఎస్వీబీసీ బోర్డు మీటింగ్ లో ఈవో మాట్లాడుతూ, ఎస్వీబీసీలోని మానవ వనరులు, ఆర్థిక వ్యవహారాలు, ఉత్పత్తి, సరఫరా, నిల్వలు తదితర విభాగాల అంశాలను ఒకే సమగ్ర సాఫ్ట్ వేర్ వ్యవస్థలో సమన్వయం చేసేందుకు సంస్థ వనరుల సమగ్ర ప్రణాళికా వ్యవస్థను (ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) తీసుకురావాలని సూచించారు. అంతేకాక, ఇప్పటి వరకు ఎస్వీబీసీలో ఫైల్స్ ను భౌతికంగా తీసుకువచ్చి రోజువారి, నెలవారీ కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు తీసుకుంటున్నారని, ఇకపై తదితర అంశాలను ఈ – ఆఫీస్ ద్వారా నిర్వహించే ప్రక్రియను చేపట్టాలన్నారు.

