BB9:రెబల్ రీతూ..ఇమ్మూ టార్గెట్

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌ ఆధ్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఘోస్ట్ హౌస్ టాస్కులో తనూజ గెలవడంతో మరోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీమ్‌కే దక్కింది. అయితే టీమ్ మొత్తం చర్చించుకొని ఈ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాము, ఇమ్మూ, తనూజ, గౌరవ్ నలుగురూ వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. మొదటి టాస్కులో రాము-ఇమ్మూ కలిసి ఆడి గెలిచారు.

ఇంతలో బిగ్‌బాస్ ఫోన్ చేశాడు. సుమన్ శెట్టితో మాట్లాడుతూ మీరు ఇప్పటివరకూ ఇచ్చిన సీక్రెట్ టాస్కులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో దివ్య-సుమన్ మీ ఇద్దరూ రెబల్స్‌గా చేసిన పని ఇంతటితో పూర్తయింది. రీతూ నేను మిమ్మల్ని కొత్త రెబల్‌గా నియమిస్తున్నాను.. మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్‌గా గొడవపడాలి అని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇంట్లో తను ఎవరితో గొడవ పడాలా అని కాసేపు ఆలోచించి ఇమ్మూని టార్గెట్ చేసింది. నువ్వు పవన్‌ని తీయకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్లం.. నువ్వు తియ్యడం వల్లే ప్రాబ్లమ్ మాకు.. అంటూ రీతూ అంది. దీనికి ఏం మాట్లాడుతున్నావ్ రీతూ ప్రతిసారి నన్ను అంటారు.. నేను తీయడం వల్ల నీకు ప్రాబ్లమ్ ఎట్ల అయితది అని ఇమ్మూ అడిగాడు. ఇమ్మూకి బుర్ర పాడుకాగా ఇలా సీక్రెట్ టాస్కుని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది రీతూ.

సీక్రెట్ టాస్కు పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దీంతో ముందు గౌరవ్‌ని తీసేయండి బిగ్‌బాస్ అని రీతూ చెప్పింది. మళ్లీ ఏమనుకుందో ఏంటో కానీ మళ్లీ వచ్చి లేదు గౌరవ్ వద్దు సాయిని తీసేయండి అని మాట మార్చింది రీతూ. కాసేపటి తర్వాత రీతూకి మళ్లీ ఫోన్‌ చేసి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. రీతూ మీరు ఇమ్మానుయేల్ ఫ్యామిలీ ఫొటోని ఎవరికీ కనపడకుండా దొంగతనం చేసి సీక్రెట్ ప్లేస్‌లో పెట్టాలి.. టాస్క్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ విషయం ఇమ్మానుయేల్‌కి చెప్పడానికి వీల్లేదు అని చెప్పగా ఇమ్మానుయేల్ బెడ్ దగ్గరికెళ్లి వెనక్కి వచ్చేసింది రీతూ.

Also Read:Modi:జంగిల్ రాజ్‌తో ఖజానా లూటీ

తర్వాత బిగ్‌బాస్ నోటీస్ పంపారు. నిన్నటిలానే మీరందరూ ఎవరు రెబల్ అని అనుకుంటున్నారో ఒక్కొక్కరిగా వచ్చి చెప్పండి.. అలానే వారే ఎందుకు అన్న రీజన్ కూడా చెప్పాలి అంటూ అందులో రాసి ఉంది. అలా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్లు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారని బిగ్‌బాస్ అన్నాడు. ఎక్కువ ఓట్లు గౌరవ్‌కి రావడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

- Advertisement -