రాహుల్ గాంధీ..’H Files’

7
- Advertisement -

హర్యానా ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ, కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ గెలుపుగా మార్చేందుకు ఒక ప్రణాళిక అమలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఓటర్ల జాబితాలోని “డుప్లికేట్” ఓటర్లను తొలగించడానికి సాఫ్ట్‌వేర్ ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ ఎందుకు చర్య తీసుకోవడంలేదని ప్రశ్నించారు. బుధవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ “హెచ్ ఫైల్స్” (H Files) పేరుతో తాజా “వోటు చోరి” ఆరోపణలను పంచుకున్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించేదని, కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల “దోపిడీ” జరిగిందని, అందులో 5.21 లక్షల డుప్లికేట్ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మా దగ్గర ఉన్నది ‘హెచ్ ఫైల్స్’. ఇది ఒక రాష్ట్రాన్ని ఎలా దొంగిలించారనే విషయంపై ఆధారపడింది. ఇది ఒక్కో నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని మాకు అనుమానం వచ్చింది. హర్యానాలో మా అభ్యర్థుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి — ఏదో తప్పు జరుగుతోందని. వారి అంచనాలు మొత్తం తారుమారయ్యాయి. ఇలాంటి అనుభవం మాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో వచ్చింది. కానీ ఈసారి హర్యానాను లోతుగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాం,” అని అన్నారు.

ఒక “బ్రెజిలియన్ మోడల్” హర్యానా ఓటర్ల జాబితాలో “సీమా”, “స్వీటీ” వంటి పేర్లతో ఓటు వేసినట్లు ఆరోపించారు. దీనిని ఆయన తన “హెచ్ బాంబ్” (హర్యానా బాంబ్) వెల్లడి‌లో భాగంగా పేర్కొన్నారు. ఒక మహిళా పేరు పోలింగ్ జాబితాలో 223 సార్లు ఉంది, ఆమె ఎన్ని సార్లు కావాలంటే అంతసార్లు ఓటు వేయగలదు. ఆమె ఎన్ని సార్లు ఓటు వేసిందన్న వివరాలు ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నాయి. అందుకే సీసీటీవీ ఫుటేజ్‌ను కమిషన్ ధ్వంసం చేసింది,” అని ఆయన అన్నారు.
హర్యానాలో పోస్టల్ ఓట్లు, అసలు ఓటింగ్ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి అన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ విజయం అని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే — హర్యానా చరిత్రలో మొదటిసారిగా పోస్టల్ ఓట్లు మరియు అసలు ఓటింగ్ ఫలితాలు పూర్తిగా వేరుగా వచ్చాయి. ఇంతకు ముందు ఇలాంటిది జరగలేదు. ఆ డేటాను చూసినప్పుడు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. మేము దాన్ని అనేకసార్లు క్రాస్‌చెక్ చేయించుకున్నాం,” అని రాహుల్ వివరించారు.

2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 55,48,800 ఓట్లు (39.94%) పొందగా, కాంగ్రెస్–సీపీఎం (మార్క్సిస్టు) కూటమి 54,64,975 ఓట్లు (39.34%) సాధించింది. ఇరువురి మధ్య తేడా కేవలం 83,825 ఓట్లు (0.60%) మాత్రమే. బీజేపీకి 48 సీట్లు, కాంగ్రెస్‌కు 37 సీట్లు లభించాయి.

Also Read:KTR:టీ హబ్ దేశానికే ప్రతిబింబం

- Advertisement -