ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్రమంత్రులో చర్చించారు మంత్రి కేటీఆర్. కేంద్రమంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌ను మంత్రి కేటీఆర్ ఛత్తీస్‌గఢ్‌లోని బేలడేల ప్రాంతాన్ని కలుపుకొని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. కలిశారు. గత ప్రభుత్వం బయ్యారం స్టీల్ ప్లాంటుపై అభ్యంతరాలు తెలిపిందని, మంత్రి పదవి చేపట్టగానే బయ్యారంపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు ఐఐఎమ్‌ను కేటాయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. కొత్తగా 11 జిల్లాలు ఏర్పడ్డాయని.. ఆయా జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. 14 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. వీటితోపాటు వరంగల్ జిల్లాఎల్కతుర్తి ప్రాంతంలో రివిజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను కేటాయించాలని కోరారు కేటీఆర్. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్ కూడా ఉన్నారు.
అంతకముందు కేంద్ర కార్మిక శాఖమంత్రి దత్తాత్రేయతో భేటీ అయిన కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్,కార్మిక శాఖ అంశాలపై చర్చించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం రైల్వేశాఖకు చెందిన 45 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేలా సహకరించాలని కోరారు.
ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ పేరుతో మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపిస్తున్నామని పేర్కొన్నారు. మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల, నిజామాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీడీ కార్మికులను ఆదుకోవాలని కోరామని చెప్పారు. బీడీ కార్మికుల కోసం 150 పడకల ఆస్పత్రి నిర్మించాలని, హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ ద్వారా అదనపు ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. సమస్యలపై దత్తాత్రేయ సానుకూలంగా స్పందించారని … హైదరాబాద్‌లో డబుల్‌బెడ్ రూం ఇళ్లపై సంయుక్తంగా సమీక్ష నిర్వహిద్దామని కేంద్ర మంత్రి కోరినట్లు చెప్పారు.