అల్లు అర్జున్‌ ఫేస్‌కు.. ఆ రోల్సే వస్తాయి..: కే.ఆర్‌ఖాన్‌

282
- Advertisement -

బఫూన్‌ ఆఫ్ బాలివుడ్ గా కొందరి చేత పిలవబడే కమాల్ ఆర్‌ ఖాన్‌ ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు. అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూడటానికి ఇష్టపడతానని పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు.

 Kamaal R Khan Sensational Tweets on allu arjun

అంతటితో ఆగకుండా రాజమౌళిని చెప్పలేని బూతుతో తిడుతూనే…. ప్రభాస్‌ను ఒంటెతో పోల్చాడు.. రానాను ఇడియట్, బ్రెయిన్ లెస్ అంటూ బాహుబలి చిత్ర యూనిట్‌పై కూడా నోరు పారేసుకున్నాడు ఈ బాలీవుడ్ నటుడు,సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్.

దాంతో ఈయనగారి మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయని కే.ఆర్.ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఫ్యాన్స్‌. అయినా..ఏ మాత్రం మార్పులేకుండా ఎవరిపై మాటల యుద్ధం చెయ్యాలో..చేస్తూనే ఉన్నాడు. ఇదే క్రమంలో ట్విట్టర్ వేదికగా కారుకూతలు కూస్తూ మళ్ళీ వార్తల్లోకెక్కాడు. తాజాగా స్టైలిష్ స్టార్ అర్జున్‌ను దూషించాడు కే.ఆర్‌ఖాన్‌.

 Kamaal R Khan Sensational Tweets on allu arjun

టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్‌పై దురహంకార వ్యాఖ్యాలతో చెలరేగిపోయాడు. ఇటీవల బన్నీ చేసిన ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’ యాడ్‌లో బన్నీ లుక్ గురించి కాంట్రవర్శి కామెంట్ చేశాడు.

 Kamaal R Khan Sensational Tweets on allu arjun

‘ఈ రోజు నాకు ఎవరో చెప్పారు… ఈ లుక్కా లుకింగ్ ఆలూ’ తెలుగులో పెద్ద స్టార్ అట. ఒకవేళ బాలీవుడ్‌కి వస్తే ఇలాంటి ఫేస్‌లకు చిన్న రోల్స్ మాత్రమే వస్తాయి. అవే చేసేదుంకు సిద్ధం అయితే బాలీవుడ్‌కు రావొచ్చు. అల్లు అర్జున్ బాలీవుడ్‌లో హీరోగా పనికి రాడనే అర్థం వచ్చేట్లు కించపరిచే వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు.

 Kamaal R Khan Sensational Tweets on allu arjun

.

అయితే కమాల్ ఆర్ ఖాన్ కామెంట్స్‌పై మెగా అభిమానులు అట్టుడికి పోయారు. ట్విట్టర్‌లో కమాల్‌ను ఉతికి ఆరేస్తున్నారు.

కాగా ఇతగాడి కారు కూతలకు హద్దు లేకుండా పోతుందని అతన్ని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని కోరుతూ.. గతంలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. కాగా పిచ్చోడు కారుకూతలకు లెక్కేంటిలే లైప్ తీస్కోండి బాస్ అని కమాల్‌ను వదిలేయడంతో మరోసారి నోరుపారేసుకున్నాడు కేఆర్‌కె.

- Advertisement -