గతంలో మా ప్రభుత్వం ఉన్నపుడు పెట్రోల్ రేట్లు పెంచి రూ.33 నరేంద్ర మోదీ, రూ.32 కేసీఆర్ తీసుకుంటున్నాడు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు అని గుర్తు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆటో యూనియన్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరికల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి ఎక్కి 2 సంవత్సరాలు అయింది కదా.. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించ లేదు మరి చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీ ఎన్నికల ముందు మషారత్ అలీ అనే అతని ఆటో ఎక్కి హామీలు ఇస్తే.. ఇప్పుడు ఆ మషారత్ అలీ ఉన్న 2 ఆటోలు అమ్ముకొని కిరాయి ఆటో నడుపుతున్నాడు అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆటో డ్రైవర్ల దగ్గర, టిఫిన్ షాపుల దగ్గర వారం వారం వసూళ్లు చేస్తారు… నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో అందరూ రౌడీలు, వ్యభిచార గృహాలు నడిపేవారు దిగారు… రేపు జూబ్లీహిల్స్‌లో వాళ్ల రాజ్యం నడుస్తది అన్నారు కేటీఆర్.
Also Read:మొంథా తుఫాన్..రెడ్ అలర్ట్

