మొంథా తుఫాన్‌..రెడ్ అలర్ట్

10
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ #Montha తుఫాను తీరం వైపు కదులుతూ కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇంటి లోపల ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ ప్రజలకు, చేపల వేటకు వెళ్లేవారికి సూచనలు చేశారు పోలీసులు.

తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గన్నవరం, హనుమాన్ జంక్షన్లో భారీ వర్షం కురియగా ఇటు నెల్లూరులోనూ పలు ఏరియాల్లో వర్షం కురుస్తోంది. మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉన్నవాళ్లు.ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది.

Also Read:ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టవా?:హరీష్

- Advertisement -