- Advertisement -
లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ నిర్మిస్తానంటున్నావ్ కానీ.. ఆటో డ్రైవర్లకు ఇవ్వడానికి నెలకు వెయ్యి రూపాయలు లేవా రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు హరీశ్.
ఇప్పటివరకు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అన్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ..మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం అన్నారు హరీష్.
Also Read:విష్ణు విశాల్…’ఆర్యన్’
- Advertisement -

