ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రఖ్యాత మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులతో ప్రత్యేక భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. అక్కడి ప్రముఖ విద్యాసంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్‌లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ చేపట్టాలని కోరారు మంత్రి.
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. తెలంగాణకు రండి.. కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దామని యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు శ్రీధర్ బాబు.
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Also Read:ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు!

