వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు

5
- Advertisement -

అమెరికాలోని వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్… మోదీ కూడా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారు అని చెప్పారు. మోదీ తనకు రష్యా నుండి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని హామీ ఇచ్చారని మళ్లీ పేర్కొన్నారు. ఈ అంశంపై అలాగే వాణిజ్యంపై కూడా మోదీతో మాట్లాడానని ఆయన తెలిపారు.

నాకు భారత ప్రజలంటే ఎంతో ప్రేమ అని ట్రంప్ అన్నారు. మా రెండు దేశాల మధ్య అద్భుతమైన ఒప్పందాలపై పని జరుగుతోంది. ఈరోజు నేను ప్రధాని మోదీతో మాట్లాడాను, మాకు చాలా మంచి సంబంధం ఉంది. ఆయన రష్యా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయడం లేదు. ఆ యుద్ధం ముగియాలని ఆయ‌న కూడా నేను ఎంతగా కోరుకుంటున్నానో అంతే స్థాయిలో కోరుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని ఆయన కూడా ఆశిస్తున్నారు. వారు ఇప్పుడు ఎక్కువ చమురు కొనడం లేదు. చాలా తగ్గించారు, ఇంకా తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు.

మోదీతో జరిగిన సంభాషణను అద్భుతమైనది గా పేర్కొంటూ, బుధవారం జరిగిన ఆ సంభాషణలో ఎక్కువగా వాణిజ్య అంశాలపై చర్చించామని తెలిపారు.అదే సమయంలో, ఈ ఏడాది మేలో భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల సైనిక ఉద్రిక్తతను తాను ఆపగలిగానని ఆయన మళ్లీ పునరుద్ఘాటించారు. దీపావళి సందర్భంగా ట్రంప్ స్వయంగా ఒక దీపం వెలిగించారు. దీపావళి చీకటి మీద వెలుగుకి, చెడు మీద మేలుకి గెలుపు అనే సంకేతాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.

Also Read:ధర్నా చౌక్‌గా సచివాలయం

దీపం వెలిగించడం అంటే మన విశ్వాసానికి, చీకటి మీద వెలుగు గెలిచే నమ్మకానికి సంకేతం. అది అజ్ఞానంపై జ్ఞానం, చెడు మీద మేలుకి విజయానికి ప్రతీక. దీపావళి సందర్భంగా ప్రజలు పురాతన కథలను స్మరిస్తారు — శత్రువులను జయించడం, అడ్డంకులను తొలగించడం, బందీలను విముక్తి చేయడం వంటి విజయాలను గుర్తుచేసుకుంటారు అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

- Advertisement -